***నల్లగొండ జిల్లా , మునగాల మండలంలోని బరాఖత్ గూడెం గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వారు 100 సంవత్సరములకు పూర్వమే ఒక పెద్ద రావిచెట్టు క్రింద ప్రతిష్టించబడి గ్రామప్రజలచే పూజలందుకొనుచుండిరి.
*** శ్రీ శ్రీ శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయం 30 సంవత్సరముల క్రితము గ్రామ ప్రజల సహాయ, సహకారములతో నిర్మాణము గావించిరి.
*** ఈ స్వామి వార్లకు ఇటీవల కాలము వరకు నిత్య నైవేద్యం వంటి నిర్వహణ లేదు, కానీ భక్తుల ఆదరణ బాగుగా నుండుటచే దేవాలయములను పునర్నిర్మాణము గావించుటకు గ్రామస్తులు సంకల్పించిరి.
2007, మార్చి 15 వ తేదీన
గ్రామప్రజలు , పరిసర ప్రాంత మరియు ఇతర ప్రాంతాల భక్తుల విరాళాలతో పునర్నిర్మాణము గావించిన దేవాలయములలో స్వామి వార్ల ప్రాణప్రతిష్ట జరిగినది.
మరియు అదే సమయములో నూతనముగా శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి వారి దేవాలయమును కూడా నిర్మించిరి.
* ఇంకను ప్రహరీ గోడ నిర్మాణము, శివాలయ గోపురము, మంచినీటి వసతి మరియు ఇతర పనులు డబ్బులు లేక ఆగి పోయి ఉన్నవి.
*** గత మూడు సంవత్సరాలుగా స్వామివార్లకు నిత్య ధూప , దీప నైవేద్యాల కొరకు భక్తులు సహాయ, సహకారములను అందించుచూ స్వామివారి కృపకు ప్రాప్తులగు చున్నారు.
* స్వామి వార్లకు ఎటువంటి స్తిర, చర ఆస్తులు లేనందున మీకు తోచిన విరాళములను అందించి, నిత్యధూప,దీప నైవేద్యము జరుపుటలో పాలు పంచు కొని, స్వామి వారి ఆశిస్సులు పొందగలరని మనవి .
* విరాళములు ఇచ్చిన భక్తుల గోత్ర ,నామములు శిలా ఫలకము పైన రాసి, వారు కోరుకున్న రోజున ప్రత్యేక పూజ జరిపించబడును.
విరాళములు సమర్పించు వివరాలకు సంప్రదించండి:
గోళ్లమూడి అప్పారావు గారు,
శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయ కమిటి చైర్మన్,
బరాకత్ గూడెం(గ్రా):నల్లగొండ (జి) ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
సెల్ నెంబర్ : (+91) 94410 10166.
e-mail: barakhatgudem@gmail.com
Contact details in USA :
Srinivas Gollamudi - (302) 294 - 2454.